ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వాయిదా
îనూతన షెడ్యూల్ను ప్రకటించిన రాష్ట్ర ఎన్నికల కమిషన్
అక్షర కిరణం, (అమరావతి): ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను రెండు రోజుల పాటు రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేసింది. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. షెడ్యూల్ ప్రకారం నవంబరు 3న ఎన్నికలు జరగాల్సి ఉంది. అదే రోజున మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఉన్న నేపథ్యంలో ఎన్నికలను వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో నవంబరు 5న మండల, జిల్లా పరిషత్ స్థానాలకు ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపింది. అలాగే, ఓట్లను నవంబరు 7న లెక్కించి, అదే రోజు ఫలితాలను వెల్లడించనున్నట్టు పేర్కొంది. రాష్ట్రంలోని 9,828 ఎంపీటీసీ, 650 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే.