అర్నబ్ తుఫాన్‌పై అమిత్ షాకు చంద్రబాబు లేఖ
îనష్టంపై అంచనాకు త్వరితగతిన కేంద్ర బృందాలను పంపాలని విజ్ఞాప్తి
అక్షర కిరణం, (అమరావతి): బంగాళాఖాతంలో ఏర్పడిన ఆర్నబ్ తుఫాన్ ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉమ్మడి ఉభయ గోదా వరి జిల్లాల్లో విధ్వంసం సృష్టించింది. ఈనేపథ్యంలో తుఫాన్ నష్టంపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రాష్ట్రంలో పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నట్టు వివరించారు. నష్టంపై త్వరితగతిన అంచనా కు కేంద్ర బృందాలను పంపాలని సీఎం కోరారు. 14 జిల్లాల్లో సహాయక చర్యల కోసం 16 ఎన్డీఆరఎఫ్, 11 ఎస్డీ ఆరఎఫ్ బృందాలను మోహరించినట్టు సీఎం తెలిపారు.
తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లోని 28 వేల మందికిపైగా ప్రజలను సహాయ పునరావాస కేంద్రాలకు తరలించినట్టు పేర్కొన్నారు. ముందస్తు చర్యల కారణంగా ప్రాణనష్టం ఎక్కువగా నమోదు కాలేదని లేఖలో వెల్లడించారు. ప్రాథమిక అంచనా ప్రకారం 180 నివాసాలు దెబ్బతిన్నాయని, 220కి పైగా చెట్లు కూలిపోయాయని చెప్పారు. తీరంలోని అనేక ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయని.. విద్యుత్ స్తంభాలు కూలిపోయి, సరఫరాకు అంతరాయం ఏర్పడిందని లేఖలో తెలిపారు. యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనులు చేపట్టినట్టు సీఎం తెలియజేశారు.
ప్రాథమిక అంచనా ప్రకారం భారీ వర్షాలతో దాదాపు 70,900 హెక్టార్లలో వరి పంట, 10,450 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని చంద్రబాబు పేర్కొన్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో అర్నబ్ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉందని సీఎం వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం కంట్రోల్ రూమ్‌లు, రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్స్ కేంద్రం నిరంతరాయంగా పనిచేస్తున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
సహాయ చర్యలు, విద్యుత్, తాగునీటి పునరుద్ధరణపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిపెట్టామని ముఖ్యమంత్రి అన్నారు. తుఫాన్ కారణంగా జరిగిన నష్టంపై పూర్తిస్థాయి అంచనాల అనంతరం కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామని వెల్లడించారు. సహాయక చర్యలకు ఎన్డీఆరఎఫ్, ఇతర కేంద్ర సంస్థల సహకారం కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తుఫాను నష్టం అంచనాల కోసం వీలైనంత త్వరగా కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపాలని హోం మంత్రిని లేఖలో కోరారు.