యానాం వద్ద తీరాన్ని తాకిన అర్నబ్ తుఫాన్..
Åఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్
అక్షర కిరణం, (విశాఖపట్నం/అమరావతి): ఆంధ్రప్రదేశ్‌ను అర్నబ్ తుఫాన్ ముంచెత్తింది.. రాష్ట్రంవైపు దూసుకొచ్చిన తుఫాన్ యానాం దగ్గర తీరాన్ని తాకింది. అక్కడ ల్యాండ్ ఫాల్ ప్రక్రియ ప్రారంభంకాగా.. మధ్యాహ్నానికి తీరాన్ని దాటుతుందని భావిస్తున్నారు. అర్నబ్ తుఫాన్ కోస్తాలోని తీరప్రాంత జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. తుఫాన్ దెబ్బకు సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడి బీచ్ రోడ్డు కోతకు గురైంది. అర్నబ్ దెబ్బకు గంటకు 145-155 కిలో మీటర్ల వేగంగా ఈదురుగాలులు వీచాయి. అర్నబ్ తుఫాన్ కోస్తాంధ్ర జిల్లాలను వణికించింది. ఈదురుగాలులు, భారీ వర్షాలు కురిశా యి. కొన్నిచోట్ల అతి భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలయమం అయ్యాయి. తుఫాన్ తీవ్రతకు తీరప్రాంతాల్లో అలలు ఎగిసిపడ్డాయి.. కొన్నిచోట్ల సముద్రం ముందుకొచ్చింది. మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసింది. బుధవారం అల్లూరి సీతారామరాజు, అనకా పల్లి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవొచ్చని అంచనా వేస్తున్నారు.
అర్నబ్ తుఫాన్ ఏపీ తీరానికి అతి సమీపంలోకి రావడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్లు, ఆర్టీజీఎస్, రాష్ట్రస్థాయి కంట్రోల్ రూమ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుఫాన్ కారణంగా విశాఖపట్నం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి సహా భారీ వర్షాలకు ఆస్కారం ఉందని.. లోతట్టు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి అధికారుల్ని ఆదేశించారు. ఈదురు గాలు లు, భారీ వర్షాల కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా చూడాలని దిశానిర్దేశం చేశారు. ప్రభావిత ప్రాంతాల్లో తమ బృందాలు పనిచేస్తున్నట్టు ఎన్డీఆరఎఫ్ అధికారులు సీఎంకు తెలిపారు. ముఖ్యంగా తుఫాన్ ప్రభావం కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలపై ప్రభావం ఎక్కువగా ఉంది. తుఫాన్ ప్రస్తుతం నరసాపురానికి 30 కిలోమీటర్లు, యానాంకు 55 కిలోమీటర్లు, కాకినాడకు 70 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 90కిలోమీటర్ల దూరంలో కేంద్రకృతమై ఉంది. తుఫాన్ ప్రభావంతో పోలవరం, కాకి నాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటున్నారు. పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో భారీ వానలకు అవకాశం ఉందంటున్నారు.