అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్..
îఏపీకి మరో 7 రోజుల పాటు భారీ వర్ష సూచన
అక్షర కిరణం, (అమరావతి): అర్నబ్ తుపాను ప్రభావంతో ఏపీలోని కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అరకు ఘాట్ రోడ్డులో రక్షణ గోడలు దెబ్బతినడం, చెట్లు కూలిపోవడం, లోతట్టు ప్రాంతా ల్లో నీరు చేరడం వంటి పరిణామాలు చోటుచేసు కున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 126 కిలోమీటర్లకు పైగా రహదా రులు దెబ్బతిన్నట్లు సమాచారం. నేలకూలిన చెట్ల తొలగింపు, కల్వర్టుల మరమ్మతులు, రాకపోకల పునరు ద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. రహదారుల మరమ్మ తులకు రూ.59.45 కోట్ల వరకు అవసరమవుతా యని అంచనా వేశారు. తుపాను బలహీనపడినప్పటికీ మరో 7 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌పై అర్నబ్ తుపాను ప్రభావం తీవ్రంగా కనిపి స్తోంది. తుపాను కారణంగా కోస్తాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లో జన జీవనం అస్తవ్యస్తమైంది. పలుచోట్ల రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చెట్లు నేలకూలడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు రాష్ట్రంలో రానున్న 7 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీర ప్రాంత ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు.
అర్నబ్ తుపాను ప్రభావంతో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉండగా.. రాయలసీమలోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. తుపాను తీరం దాటే సమయంలో బలమైన ఈదురుగాలులు వీచినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈ సమయంలో కరెక్ట్ కాదు.. ఎన్నికల్ని పూర్తిగా రద్దు చేయండి.. ఏపీ ప్రభుత్వానికి విజయసాయిరెడ్డి సలహాలు
“గుళ్లోకి వెళ్లాలంటే డిక్లరేషన్ తప్పనిసరి”: అన్యమతస్థుల ఆలయ ప్రవేశంపై హైకోర్టు నిబంధన, సీఎం విజయ్‌పై ప్రశంసలు
తుపాను క్రమంగా బలహీనపడుతున్నప్పటికీ వర్షాల ముప్పు వెంటనే తొలగిపోయే పరిస్థితి లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు. సముద్రంలో అలలు ఉద్ధృతంగా ఉండే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు పరిసర ప్రాంతాల్లో తుపాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. భారీ వర్షాలతో చాపరాయి జలపాతం ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. జలవిహార్ వద్ద రక్షణ గోడ కూలిపోయింది. అరకు-విశాఖ ఘాట్ రోడ్డులోని బీసుపురం వద్ద రిటైనింగ్ వాల్ దెబ్బతినడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.