సీతన్న గార్డెన్స్‌లో కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ శ్రీభరత్
అక్షర కిరణం, (మాధవధార): మాధవధార సీతన్న గార్డెన్స్‌లో శ్రీ గాయత్రీదేవి శ్రీ కనకమహాలక్ష్మి శ్రీ కనకదుర్గ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఆలయ ధర్మకర్త సనపల కీర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాలకు విశాఖ ఎంపీ శ్రీభరత్ విచ్చేశారు. ఆయనకు ఆలయ ధర్మకర్త సనపల కీర్తి ఆహ్వానం పలికి శాలువాతో సత్కరించి, అమ్మవారి చిత్ర పటాన్ని అందజేశారు. శుక్రవారం కావడంతో తెల్లవారు జాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు మహిళలచే సామూహిక కుంకుమ పూజలు,హోమాలు నిర్వహించారు. ఈ సంద ర్బంగా ఆలయ ధర్మకర్త సనపల కీర్తి మాట్లాడుతూ దేవి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడ పెద్ద ఎత్తున్న ఉత్సవాలు నిర్వహించడం జరిగిందని, దేవి శరన్నవరాత్రి మహోత్సవా లలో భాగంగా శుక్రవారం మహిషాసుర మర్ధని దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం ఇస్తున్నారని తెలిపారు. శరన్నవరాత్రులలో తొమ్మిదో రోజు చాలా ప్రత్యేకమైనది. అమ్మవారు మహిషాసుర మర్ధని దేవిగా దర్శనమిస్తారని తెలిపారు. శుక్రవారం అమ్మవారు మహిషాసుర మర్దనీ అవతారంలో దర్శనమిచ్చారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని సనపల కీర్తి తెలిపారు. కార్యక్రమంలో మహిళలు పాల్గొని పూజలు నిర్వహించారు.