తొలి వేతనాన్ని అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన ఎంపీ చింతకాయల విజయ్
అక్షర కిరణం, (ఢిల్లీ/జాతీయం): అమరవీరుల కుటుంబా లకు నూతన రాజ్యసభ ఎంపీగా ఎంపికైన చింతకాయల విజయ్ అండగా నిలిచారు. ఎంపీగా తనకు వచ్చిన మొదటి నెల జీతాన్ని అమరవీరుల కుటుంబాలకు అందజేశారు. ఆయనకు వచ్చిన రూ. 3 లక్షల చెక్కును రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్కు అందజేశారు. దేశం కోసం పాటుపడుతున్న సైనికుల కుటుంబాలకు అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. పదవి చేపట్టిన తర్వాత తనకు వచ్చిన మొదటి జీతాన్ని ఇలా ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని విజయ్ అన్నారు. ఈ సందర్భంగా ఎంపీ చింతకాయల విజjáYT మాట్లాడుతూ దేûశం కోసం అహర్నిశలు శ్రమిస్తూ, ప్రాణత్యాగాలు చేసిన సైనికుల కుటుంబాలకు అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. తనవంతు సాయంగా తన మొదటి జీతాన్ని అమరవీరుల కుటుంబాలకు అందజేయడం ఆనందంగా ఉందన్నారు. పదవి చేపట్టిన వెంటనే తొలి వేతనాన్ని సైనికుల కుటుంబాల కోసం వెచ్చించడంతో విజయ్ను పలువురు ప్రశంసించారు.
అమరావతి పేరును మారవడంపై విమర్శలు
రాజ్యాంగ విలువలు తెలియని వ్యక్తి, అమరావతి పేరును మావిగన్గా మార్చాలి అనుకుంటున్నారని టీడీపీ ఎంపీ చింతకాయల విజయ్ రాజ్యసభలో వ్యాఖ్యలు చేశారు. కేరళ పేరును కేరళంగా మార్చి కేంద్ర ప్రభుత్వం ఆ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించింది. ఇదివరకు అమరావతి బిల్లును పాస్ చేసి చట్టబద్ధత కల్పించిందని.. కానీ ఇప్పుడు ఆపేరును మావిగన్గా మారుస్తానని అనడంపై ఆయన విమర్శలు చేశారు. పార్లమెంట్ ఒకసారి బిల్లు పాస్ చేసిన తర్వాత దానికి వ్యతిరేకంగా ఎవరూ వెళ్లడానికి వీల్లేదని, కానీ రాజ్యంగం విలువలపై నమ్మకం లేని వారు దానికి వ్యతిరేకంగా మాట్లాడతారని ఆయన పేర్కొన్నారు. ఇటీవల ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ ఉత్తమ ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థుల ఫొటోలను పత్రికల మొదటి పేజీల్లో ప్రచురించడాన్ని ఆయన రాజ్యసభలో ప్రశంసించారు. పేద విద్యార్థుల విజయగాథలను పత్రికల మొదటి పేజీల్లో ప్రకటనలు ఇవ్వడం అభినందనీయ మన్నారు. విద్యార్థుల్లో ఆత్మ స్థైర్యాన్ని పెంపొందించేందుకు ఇలాంటి పథకాన్ని ప్రారంభించాలని రాజ్యసభ జీరో అవర్లో ప్రస్తావించారు.