మోదకొండమ్మను దర్శించుకున్న ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే బండారు
అక్షర కిరణం, (మాడుగుల): మాడుగుల మోద కొండమ్మ పండుగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి జాతరలో రైల్వే స్టాండిరగ్ కమిటీ చైర్మన్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ అమ్మవారిని దర్శిం చుకున్నారు. ఎంపీ సీఎం రమేష్ మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తో కలసి మంగళవారం ఆలయంలో ప్రత్యేక కుంకుమ అభిషేకంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేష్ ఆలయానికి వచ్చే భక్తుల కు ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ సభ్యులను అభి నందించారు. ఆలయానికి వచ్చే భక్తులకు వడదెబ్బ తగల కుండా ఆలయం టెంట్లు, భక్తులకు అవసరవయ్యే అనేక ఏర్పాట్లు చేసిన కమిటీ సభ్యులను ఎంపీ రమేష్ అభినం దించారు. భక్తులు ఇళ్లవద్ద పూజించిన ఘటాలతో అమ్మవారికి ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకు న్నారు. ఈసందర్భంగా ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ఆలయానికి విచ్చేసి అమ్మ వారిని దర్శించుకున్న భక్తులందరికి పండుగ శుభాకాంక్ష లు తెలియజేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు వారు తెలియజేశారు.