మన పలాస` మన బాధ్యతలో రోడ్లను శుభ్రం చేసిన ఎమ్మెల్యే శిరీష
అక్షరకిరణం, (పలాస): పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష నూతన ఒరవడికి నాంది పలికారు. రోడ్ల జంగిల్ క్లియరెన్స్‌కు ప్రజలు స్వచ్ఛందంగా రావాలని మన పలాస మన బాధ్యత కార్యక్రమంతో ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా గురువారం ఉదయం 6 గంటల నుండి ఆమె స్వయంగా చీపురుపట్టి రహదారులను శుభ్రం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి భారీగా స్పందన వచ్చింది. పార్టీలకు అతీతంగా ప్రజలు జంగిల్ క్లియరెన్స్ పనుల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే శిరీష నిర్ణయంపై ప్రజలు, ప్రభుత్వ అధికారులు హర్షం వ్యక్తం చేసి ఆమెను అభినందించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాలపాటు నిర్లక్ష్యం నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా 500 కి.మీ రోడ్ల జంగిల్ క్లియరెన్స్‌కు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో ఆర్ అండ్ బీ డీఈ రామినాయుడు, ఇతర ప్రభుత్వ అధికారులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.