బీటీ రహదారులను ప్రారంభించిన ఎమ్మెల్యే రవికుమార్
అక్షరకిరణం, (పొందూరు): ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని ఆముదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ ఛైర్మన్ కూన రవికుమార్ అన్నారు. పొందూరు మండలంలో సుమారు రూ.7 కోట్లతో నిర్మించిన పలు బీటీ రహదారు లను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి రహదారులే ప్రధాన ఆధారమని, నాణ్యమైన రోడ్లు ఉన్నప్పుడే వ్యవసాయం, విద్య, వైద్యం, వ్యాపారం వంటి రంగాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని సూచించారు. నియోజకవర్గాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతా మన్నారు. మండలంలో రూ.2 కోట్లతో నిర్మించిన తండ్యం గ్రామం నుండి మూడు మర్రిచెట్ల వరకు, రూ.1.2 కోట్లతో పొందూరు నుండి లొట్టపేట వరకు, రూ.2.4 కోట్లతో పొందూరు నుండి సర్వేశ్వరపురం వరకు, రూ.1 కోటితో గూననపేట నుండి మంగంపేట వరకు పూర్తి చేసిన రహదారుల వల్ల ఆయా గ్రామాల మధ్య రాకపోకలు మరింత సులభతరం అవుతా యని వివరించారు. ఈ కార్య క్రమంలో మండల ప్రముఖులు చిగురుపల్లి రామ్మోహన్, బలగ శంకర్ భాస్కర్, అన్నెపు రాము, అనకాపల్లి రంగనాయకులు, రాష్ట్ర డైరెక్టర్ విజయలక్ష్మి, బాడాన శేషగిరి, కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.