బలిజపాలెం, జల్లెలపాలెం, వెన్నెలపాలెం గ్రామదేవతల పండుగల్లో ఎమ్మెల్యే పంచకర్ల
అక్షర కిరణం, (పెందుర్తి): సబ్బవరం మండలం నారపాడు పంచాయతీ బలిజపాలెం గ్రామంలో గురువారం మరిడిమాంబ పండుగలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం గ్రామ సర్పంచ్ మామిడి శంకర్రావు ఏర్పాటుచేసిన చీరల పంపిణీలో పాల్గొని గ్రామా నికి సేవ చేస్తున్న వారిని గుర్తించి సత్కరించి దుస్తులు బహుకరించారు. అనంతరం గ్రామంలో పేదలకు చీరల పంపిణీ చేశారు. కార్యక్రమంలో సబ్బవరం మండలం కూటమి నాయకులు, కార్యకర్తలు నారపాడు పంచాయతీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
జల్లెలపాలెంలో మరిడిమాంబ ఉత్సవంలో పంచకర్ల
పరవాడ మండలంలో రావాడ పంచాయతీ జల్లెలపాలెం గ్రామదేవత మరిడిమాంబ మహోత్సవం, వెన్నెలపాలెం గ్రామ దేవత దుర్గమాంబ మహోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు పాల్గొన్నారు. ఆయన అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు బండారు అప్పలనాయుడు, పంచకర్ల ప్రసాద్ రావు, పార్టీ మండల అధ్యక్షులు వియ్యపు చిన్న, బొద్దపు శ్రీనివాస్, జడ్పీటీసీ మాజీ సభ్యులు పైల జగన్నాథం, మాజీ ఎంపీపీ అప్పలనాయుడు, పరవాడ సర్పంచ్ అప్పల నాయుడు, తానాం సర్పంచ్ రమణ, ముత్యాలంపాలెం సర్పంచ్ చింతకాయల ముత్యాలు, రావాడ సర్పంచ్ సన్యాసినాయుడు, నర్సింగ్‌రావు, డొల్ల రామునాయుడు, పిల్ల శివకృష్ణ, బిగిడి రామగోవింద్, వర్రీ పరదేశి నాయుడు, కేఎన్ఆర్, సుందరపు శ్రీనివాస్, పావని, లక్ష్మీ, జల్లెలపాలెం, వెన్నెలపాలెం గ్రామాల నాయకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.