మరిడిమాంబ పండుగ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు
అక్షర కిరణం, (పెందుర్తి): మరిడిమాంబ అమ్మ వారి పండుగ పోస్టర్‌ను ఈనెల 24వ తేదీన గురువారం సుజాతనగర్ క్యాంపు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు ఆవిష్కరించారు. జీవీఎంసీ 96వ వార్డు పెందుర్తి గ్రామ ఇలవేల్పు మరిడిమాంబ పండుగ ఈనెల 27న వైభవంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పండుగను పురస్కరించుకొని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర కార్పొరేషన్ డైరెక్టర్, పెందుర్తి గౌరీ సంఘం అధ్యక్షులు వేగి పరమేశ్వరరావు, వార్డు అధ్యక్షులు దాడి సంతోష్, రాజేంద్రప్రసాద్, పీలా జితేంద్ర, కిల్లి రమేష్, రమేష్, వేగి గోవింద్, గొర్లి శ్రీనివాసరావు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.