పరదేశమ్మవారి ఉత్సవంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు
అక్షర కిరణం, (పెందుర్తి): చిన్నముసిడివాడ గ్రామ దేవత పరదేశమ్మ వారి మహోత్సవంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు పాల్గొన్నారు. ఈనెల 25న మంగళ వారం సాయంత్రం 97వ వార్డు చిన్నముసిడివాడ గ్రామ దేవత పరదేశమ్మ వారి మహోత్సవం ఘనంగా నిర్వహిం చారు. ఈఉత్సవంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబు పాల్గొ న్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బండారు అప్పల నాయుడు, కార్పొరేటర్ వసంత శంకర్రావు, వార్డు అధ్యక్షులు సోమశేఖర్, నాయ కులు సంతోష్, ముమ్మన గురువులు, బుచ్చిబాబు, అప్పల నాయుడు, వెంకన్న, చైతన్య, ఆనంద్, కిషోర్ పాల్గొన్నారు.