బాలియాత్రకు ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు ఆహ్వానం
అక్షరకిరణం, (విశాఖపట్నం): బాలియాత్ర 2025 నిర్వహణ కమిటీ, శ్రీముఖలింగం సోమవారం ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవికుమార్‌ను కలిసి నవంబర్ 9న జరగబోయే బాలియాత్రలో పాల్గొని విజయవంతం చేయా లని ఆహ్వానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలియాత్ర విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి ప్రభుత్వ అధికారిక కార్యక్రమంగా నిర్వహించడానికి కృషి చేస్తానని తెలియజేశారు. కళింగ రాజ్య పూర్వ ఆచారమైన బాలియాత్రని విశేషంగా నిర్వహించడానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేశారు. ఈసందర్భంగా బాలియాత్ర 2025 నిర్వహణ కమిటీ సభ్యులు ఆయనకు కృత్ఞతలు తెలిపారు.