ఎమ్మెల్యే గౌతు శిరీష మన పలాస` మన బాధ్యత వినూత్న కార్యక్రమం
అక్షర కిరణం, (పలాస): మన పలాస మన బాధ్యత అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. ఎమ్మెల్యే తన కార్యాలయం లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ అంశాన్ని స్పష్టం చేశారు. పలాస నియోజకవర్గంలో 250 కిలోమీటర్ల మేర ఆర్అండ్ బీ రోడ్డు ఉందని, ఆ రోడ్డు కిరువైపులా జంగిల్ క్లియరెన్స్ చేపట్టేందుకు స్వచ్చంద సంస్థలు, ఎన్జీఓలు, వెలుగు సిబ్బందితోపాటు అన్ని ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది, ఎన్ఆర్ఈజీఎస్, సచివాలయ సిబ్బంది, పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు ముందుకొస్తున్నట్టు చెప్పారు. ఈనేపథ్యంలో ఈ నెల 10న ఉదయం 6 నుంచి 11 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటికే యాభై కిలోమీటర్ల మేర యంత్రాలతో జంగిల్ క్లియరెన్స్ చేసేందు కు కొంతమంది ముందుకొచ్చినట్టు చెప్పారు. ఈ బృహత్కర బాధ్యతలో ప్రజలు కూడా తమ వంతు పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. మన ఇంటిని ఎలా శుభ్రపరచుకుంటా మో పరిసరాలను కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకోవా లని కోరారు. కార్యక్రమంలో ఏపీటీపీసీ చైర్మన్ వజ్జ బాబూరావు, టీడీపీ జిల్లా కార్యదర్శి పీరికట్ల విఠల్ రావు, సప్ప నవీన్‌కుమార్, గురిటి సూర్యనారాయణ, గోవిందు పాపారావు, జనసేన నాయకుడు సంతోష్‌కుమార్, ఆర్ అండ్ బీడీఈ సాసుమాన రామానాయుడు, జేఈ విక్రమ్, తదితరులు పాల్గొన్నారు.