జీవీఎంసీ ఎన్నికల్లో తొలి ఫలితం విడుదల
సీపీఎం అభ్యర్థి ఎం.కృష్ణయ్య గెలుపు
అక్షర కిరణం, (విశాఖపట్నం): గ్రేటర్ శాఖపట్న మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి ఫలితం వెల్లడైంది. విశాఖపట్నం 105 వార్డు నుంచి వామపక్ష అభ్యర్థి (సీపీఎం) ఎం.కృష్ణయ్య సంచలన విజయం సాధించారు. అక్కడ కూటమి అభ్యర్థిపై ఆయన 101 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. చిన్న వార్డు కావడంతో 105వ వార్డు ఫలితం త్వరగా వెల్లడైంది. మిగిలిన వార్డుల కౌంటింగ్ కొనసాగుతోంది.