మత్స్యావతారంలో దర్శనమిచ్చిన జగన్నాథస్వామి
అక్షర కిరణం, (విశాఖపట్నం): విశాఖపట్నం టౌన్ కొత్త రోడ్ లోని శ్రీ జగన్నాథస్వామి రథోత్సవాల్లో భాగంగా శుక్ర వారం స్వామివారు మత్స్యావతారంలో భక్తులకు దర్శన మిచ్చారు. ఈసందర్భంగా ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు, సహస్రనామార్చనలు, విశేష అర్చనలు నిర్వ హించారు. శ్రీ సంపత్ వినాయగర్ దేవస్థానం తరపున వ్యవస్థాపక ఫ్యామిలీ సభ్యులు టి.ఆర్.చోళన్, సహాయ కమిషనర్, కార్యనిర్వహణధికారి డీవీవీ ప్రసాద్, టి.రాజేశ్వ రన్ పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ధర్మ కర్తల మండలి చైర్మన్ సూరాడ రాజ్‌కుమార్, సభ్యులు, ఈఓ టి.రాజగోపాల్ రెడ్డి, ఫెస్టివల్ ఆఫీసర్ టి.అన్నపూర్ణ, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం అన్న సమా రాధన, సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్ర మాలు భక్తులను అలరించాయి.