ఏపీ కాలింగ కార్పొరేషన్ డైరెక్టర్‌గా లోళ్ల రాజేష్ ప్రమాణ స్వీకారం
అక్షరకిరణం, (విజయవాడ): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేట్ పదవులు కొద్దికాలం కిందట ప్రకటించింది. శ్రీకా కుళం జిల్లా కవిటీ జనసేన పార్టీ నేత లోళ్ళ రాజేష్‌కు కాలింగ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ప్రకటించారు. సోమవారం ఉదయం విజయవాడ బీసీ కార్పొరేషన్ కార్యాల యంలో జరిగిన ప్రమాణోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథి గా చైర్మన్ రోనంకి కృష్ణమనాయుడు హాజరై లోళ్ల రాజేష్ తో ప్రమాణ స్వీకారం చేయించారు. లోళ్ళ రాజేష్ మాట్లాడు తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాలింగ్లను ఏకతాటిపైకి తీసుకు వచ్చి వారి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఉత్తరాంధ్రలో అధిక శాతం కాలింగులు ఉన్నారని అయితే వారిని ప్రస్తుత కూటమి ప్రభుత్వం గుర్తించి అభివృద్ధి పథంలో నడిపించేం దుకు కృషి చేస్తుందన్నారు. అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు కాలింగ డైరెక్టర్ పదవికి వన్ని తెచ్చే విధంగా ఉంటానని ఈసందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో పలు వురు కాలింగులతోపాటు అధికారులు పాల్గొన్నారు.