మహిళ పోలీస్‌స్టేషన్ సీఐగా నిర్మల
అక్షర కిరణం, (విశాఖపట్నం సిటీ): మహిళా పోలీస్ స్టేషన్ సీఐగా జి నిర్మల పదవీ బాధ్యతలు చేపట్టారు. 2004 బ్యాచ్‌కి చెందిన ఈమె విజయనగరం, శ్రీకాకుళం, హార్బర్, దిశ పోలీస్ స్టేషన్లో పనిచేశారు. ఆమె మాట్లాడుతూ మహిళ పోలీస్ స్టేషన్లో సీిఐగా బాధ్యతలు స్వీకరించి నందుకు ఆనందంగా ఉందని తెలిపారు. గతంలో దిశా పోలీస్ స్టేషన్లో పనిచేసిన అనుభవం ఉందని దీనితో స్టేషన్‌కు వచ్చే మహిళలకు న్యాయం చేసే దిశగా ముందు కు వెళ్తానని తెలిపారు. ఆమెకు మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.