బంగాళా ఖాతంలో దూసుకువస్తున్న లానినో
అక్షరకిరణం, (విశాఖపట్నం/హైదరాబాద్): బంగా ళాఖాతంలో వరుస అల్పపీడనాలు సంభవిస్తున్నాయి. లానినో తుఫాన్ దూసుకువస్తోంది. ఈ తుఫాన్ ప్రభావంతో వర్గాలు పెరగనున్నాయని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. ఈ సంవత్సరం భారతదేశంపై లానినో ప్రభావం ఎక్కువ ఉండనుంది. ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడ నున్నాయని పేర్కొన్నారు. ఈనెల 20 తర్వాత బంగాళా ఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నదని తెలిపారు. దానివలన మధ్యాంధ్ర, ఈనెల 20 నుండి అక్టోబర్ రెండోవారం వరకు వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంది. అక్టోబర్ 20 తర్వాత ఈశాన్య రుతుపవనాలు ప్రారంభం కానున్నాయి. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావారణ శాఖ అధికారులు సూచించారు. ప్రజలు కూడా వర్షాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.