పైడితల్లమ్మను దర్శించుకున్న కూన రవికుమార్
అక్షరకిరణం, (పొందూరు): పొందూరు పైడితల్లి అమ్మవారి 40 యాత్ర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే కూన రవికుమార్ దర్శించుకుని అమ్మవారికి మొక్కలు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా యాత్రలో ఎటువంటి గొడవలు, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు తీసుకున్నామని ఎస్ఐ సత్యనా రాయణ తెలిపారు. భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. రవికుమార్‌తో పాటు టీడీపీ నాయకులు అన్నెపు రాము, బి శంకర్‌భాస్కర్, అనకాపల్లి చినరంగా, బాడాన గిరి, అనకాపల్లి శివ, రమణారావు రవి, కె.శ్రీను తదితరులు ఉన్నారు.