ఈస్ట్ సబ్ డివిజన్ ఏసీపీగా కొండపల్లి లక్ష్మణమూర్తి
అక్షర కిరణం, (విశాఖపట్నం సిటీ): విశాఖ ఈస్ట్ సబ్ డివిజన్ ఎసిపిగా కొండపల్లి లక్ష్మణమూర్తి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. 1995 బ్యాచ్‌కి చెందిన లక్ష్మణ మూర్తి ఎస్ఐగా విశాఖ టాస్క్ఫోÛర్స్‌లో చేసి అనంతరం సీఐగా త్రీ టౌన్, పెందుర్తి, పీఎం పాలెం, భీమిలి, ఇంటెలిజెన్సీ, ఏసీబీలలో పనిచేశారు. ప్రస్తుతం అనకాపల్లి స్పెషల్ బ్రాంచ్`2 సీఐగా విధులు నిర్వహిస్తూ డీఎస్పీగా పదోన్నతి పొంది విశాఖ ఈస్ట్ ఏసీపీగా నియమితుల య్యారు. ఆయన మాట్లాడుతూ డివిజన్ పరిధిలోని అన్ని స్టేషన్లను సమన్వయ చేసుకొని నేరాల సంఖ్య తగ్గించేలా చూస్తానని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలి పారు. గంజాయి, డ్రగ్స్, అన్ని మత్తుపదార్థాలపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. అనంతరం అధికారులు సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.