కోడూరు సాయి శ్రీనివాసరావుకు బంగారు నంది అవార్డు
అక్షర కిరణం, (సాలూరు): సాలూరు పట్టణంలో 3 దశాబ్దాలుగా విద్యారంగంతోపాటు కరోనా సమయంలో విశిష్ట సేవలు అందించిన డాక్టర్ కోడూరు సాయి శ్రీని వాసరావుకు తెలంగాణ సాంస్కృత సంస్థ తెలుగు కళారత్నా లు సేవాసంస్థ హైదరాబాద్ త్యాగ రాజభవన్లో బంగారు నంది అవార్డును అందజేశారు. ఆదివారం తెలంగాణ హై కోర్టు న్యాయమూర్తి జె.జగదీశ్వరావు కోడూరు సాయి శ్రీని వాసరావు, జాతీయ బంగారు నంది అవార్డు అందు కున్నారు. వీరికి ఘనంగా సత్కరించారు. ఈకార్యక్రమంలో తెలుగు కళరత్నాలు సేవా సంస్థ సీఈఓ బొమ్మడా నరసింగరావు, తెలంగాణ సంస్కృత సంస్థ డైరెక్టర్ దానసి ఉషారాణి విద్యావేత్తలు, కళాకారులు పాల్గొన్నారు. జాతీయ బంగారు నంది అందుకున్న డాక్టర్ కోడూరు సాయి శ్రీనివా సరావుకి డిప్యూటీ డీఈవో రాజ్‌కుమార్, ప్రాణదాత అధ్యక్షులు వైద్యులు వాడాడ గణేశ్వరావు, ఆరిశెట్టి మోహన్ రావు మొయిదా కృష్ణ అభినందనలు తెలియజేశారు.