కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమÖత
·ముద్రగడ కుటుంబం కీలక నిర్ణయం ·ప్రభుత్వ లాంఛనాలు తిరస్కరణ
అక్షర కిరణం, (హైదరాబాద్): కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని సింధు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మంగళవారం సాయంత్రం ముద్రగడ తుదిశ్వాస విడిచారు. ముద్రగడ పద్మనాభం జూన్ నెలలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలించి ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా.. నాటి నుంచి వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం కన్నుమూశారు.
ముద్రగడ తన రాజకీయ ప్రస్థానంలో ఎన్నో రాజకీయ పార్టీలు మారినప్పటికీ.. తన సిద్ధాంతాలకు, తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండేవారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఆయన వైఎసఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ సమయంలో పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడిపోతారని, ఒకవేళ పవన్ గెలిస్తే తన పేరును మార్చుకుంటానని ముద్రగడ సవాల్ చేశారు. ఎన్నికల్లో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత.. చెప్పిన మాట ప్రకారం తన పేరును గెజిట్ ద్వారా ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుని మాట మీద నిలబడే వ్యక్తిగా నిరూపించుకున్నారు.
ముద్రగడ పద్మనాభం కుటుంబం కీలక నిర్ణయం..
ప్రభుత్వ లాంఛనాలు తిరస్కరణ
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలన్న ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తిరస్కరించారు. ముద్రగడను బతికున్న సమయంలో ఎన్నో రకాలుగా అవమానించారని.. ఇప్పుడు అధికారిక గౌరవాలు, సానుభూతి అవసరం లేదని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా తెలిపారు. ముద్రగడ ఏరోజూ అధికారం కోసం పాకులాడలేదని.. ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అవసరం లేదని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు తెలియజేశారు. కిర్లంపూడిలోని ఇంటికి సమీపంలోనే ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. గతంలో ముద్రగడ పద్మనాభంతో పాటుగా ఆయన కుటుంబాన్ని అనేక రకాలుగా వేధించి, అవమానించారని రాజా చెప్పుకొచ్చారు. ముద్రగడ ప్రజా సమస్యలపైనే పోరాటం చేసేవారని.. ఆయన బతికున్నప్పుడు ఇబ్బంది పెట్టి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల్ని అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో ఫోన్లో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, కేబినెట్ మంత్రిగా ముద్రగడ పద్మనాభం సేవలందించారని గుర్తు చేశారు. అందుకే ముద్రగడ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.. కానీ పద్మనాభం కుటంబం మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని అంగీకరించలేదు.. అధికారిక లాంఛనాలు అవసరం లేదని తేల్చి చెప్పారు.
ముద్రగడ పద్మనాభానికి, తన తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావుతో పాటుగా తనతోనూ ఆత్మీయ అనుబంధం ఉందన్నారు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. ముద్రగడ విలువలకు కట్టుబడి రాజకీయాలు చేసిన మహోన్నత వ్యక్తి అన్నారు. ముద్రగడ పద్మనాభం భౌతికకాయానికి రాజా పూలమాల వేసి నివాళులర్పించి.. వారి కుమారుడు, పత్తిపాడు వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ ముద్రగడ గిరిబాబు, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం ముద్రగడ కుటుంబం అంత్యక్రియలకు సంబంధించి తీసుకున్న నిర్ణయాన్ని తెలియజేశారు. మొత్తం మీద ముద్రగడ అంత్యక్రియలకు సంబంధించి.. ఆయన కుటుంబం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది.
అభయ`మీ భద్రత మా బాధ్యత ప్రారంభించిన ీVAంమంత్రి అనిత
అక్షర కిరణం, (అనకాపల్లి): అనకాపల్లి జిల్లాలో మహిళల భద్రతను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆధ్వర్యంలో పోలీసు శాఖ చేపట్టిన ‘అభయ`మీ భద్రత మా బాధ్యత’ కార్యక్రమాన్ని ీVAం మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ అభయా` మీ భద్రత మా బాధ్యత కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంతో ప్రతి పాఠశాల, కళాశాలలో అభయ ఫిర్యాదు పెట్టెలను ఏర్పాటు చేసి, మహిళలు, విద్యార్థినులు నిర్భయంగా తమ సమస్యలను తెలియజేసే అవకాశాన్ని కల్పిస్తున్నామన్నారు. శక్తి యాప్, శక్తి టీమ్స్ సేవలను మరింత బలోపేతం చేయడంతో పాటు, సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఎదురైనా వెంటనే 112కు కాల్ చేయాలని ప్రతి ఒక్కరికీ సూచించారు. మహిళల భద్రతకు ఎలాంటి రాజీ లేదు. ప్రతి మహిళ ధైర్యంగా జీవించే సమాజ నిర్మాణమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని ీVAం మంత్రి అనిత పేర్నొన్నారు.
ఉద్యోగ విరమణ చేసిన కార్మికులకు ఆత్మీయ వీడ్కోలు
అక్షర కిరణం, (విశాఖపట్నం): జీవీఎంసీ 36వ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో బుధవారం ఉద్యోగ విరమణ వేడుకలో పెర్మనెంట్ వర్కర్ ఇంటి లక్ష్మమ్మ, అవుట్ సోర్సింగ్ వర్కర్ గోండుల దుర్గమ్మను సిబ్బంది ఆత్మీయంగా సత్కరించి వీడ్కోలు పలికారు. సుదీర్ఘకాలం పాటు అంకిత భావంతో సేవలు అందించిన వీరిద్దరి జీవితం సుఖ సంతో షాలతో, ఆయురారోగ్యాలతో గడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ అప్పలరాజు, సెక్రటరీలు మురళి, చిరంజీవి, మేస్త్రి శ్రీనివాస్, సూపర్వైజర్ అన్నమ్మ, పారిశుధ్య కార్మికులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాలలో రక్తదాన శిబిరం
అక్షర కిరణం, (విశాఖపట్నం): సంస్థ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలోని ప్రభుత్వ కెమికల్ ఇంజనీరింగ్ కళాశాల, విశాఖ బ్లడ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని కళాశాలలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ బ్లడ్ సెంటర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డి. రామ్ రవిశంకర్ ముఖ్య సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ రక్తదాన శిబిరంలో 50 మంది రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ రమణ అధ్యాపకులు, సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీ రమణ, కెమికల్ ఇంజినీరింగ్ సీని యర్ లెక్చరర్ వి. శ్రీకాంత్, లెక్చరర్ సీహెచ్.వినోద్ కుమార్, విభాగాధిపతులు ఎం.మహాలక్ష్మి, సీహెచ్. జయప్రకాష్ రెడ్డి, డాక్టర్ ఎస్.ప్రశాంతకుమారి, డి.దామోదర్, కేబీవీఎస్. ఎస్.కుమార్, డాక్టర్ ఎం.విజయలక్ష్మి ఎన్.ఎన్వీ కుమారి, పి.కృష్ణారెడ్డి, ఆర్.కోటేశ్వరరావు, బి.రామాంజనేయులు, ఎనఎసఎస్ కోఆర్డినేటర్ వి.శ్రీకాంత్, ఆఫీస్ సూపరింటెం డెంట్ కె.సాయిలక్ష్మి పాల్గొన్నారు.
జూ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ: స్పీకర్ అయ్యన్నపాత్రుడు
అక్షర కిరణం, (విశాఖపట్నం): ఆంధ్రప్రదేశ్ శాసన సభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నేతృత్వంలో ఏపీ వన్యప్రాణుల, పర్యావరణ పరిరక్షణ కమిటీకి చెందిన 12 మంది సభ్యుల బృందం విశాఖలోని ఇందిరా గాంధీ జూ పార్క్‌ను పరిశీలించారు. జూ అభివృద్ధి, వన్యప్రాణుల సంరక్షణ, సందర్శకులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై అధికారులతో సమీక్షించారు. స్పీకర్ మాట్లాడుతూ విశాఖ పట్నం పరిసర ప్రాంతాల్లో ఉన్న 120 పరిశ్రమలు, బ్యాంకుల నుంచి కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులు సమీకరించి జూ అభివృద్ధికి వినియోగించాలని సూచించారు. ఎంపీలు ప్రతి ఏడాది రూ.50 లక్షలు, జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రూ.3 కోట్లు జూకు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని తెలి పారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో చర్చించి మరిన్ని నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. జూలో ప్రస్తుతం 1,404 జంతువులకు కేవలం ఒక్క పశువైద్యుడు మాత్రమే ఉండడం, 82 శాతం సిబ్బంది కొరత తీవ్ర ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. తక్షణమే అవసరమైన సిబ్బందిని నియమించి, సందర్శకులకు సరి పడా మరుగుదొడ్లు, స్వచ్ఛమైన తాగునీటి సదు పాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో కంబాలకొండ అటవీ ప్రాంతా న్ని ఆక్రమణల నుంచి కాపాడిన విషయాన్ని కమిటీ సభ్యు లకు గుర్తు చేశారు. పర్యటనలో కమిటీ సభ్యులు, ఎమ్మెల్యే లు కురుగొండ్ల రామకృష్ణ, గోండు శంకర్రావు, చింత మనేని ప్రభాకర్, ఎమ్మెల్సీలు బి.తిరుమలనాయుడు, పాల వలస విక్రాంత్ పాల్గొని, పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణకు సంబంధించిన అంశాలపై అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.