కల్కి వేంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవాలకు పందిరి రాటతో శ్రీకారం
అక్షరకిరణం, (పాయకరావుపేట): పాయకరావు పేట నియో జకవర్గం నక్కపల్లి మండలంలోని కల్కి వేెంక టేశ్వరస్వామి వారి వార్సిక కళ్యాణం మార్చి 10వ తేదీన నిర్వహిస్తున్నట్టు ఆలయ నిర్వహకులు తెలిపారు. దీనిలో భాగంగా సోమవారం ఉత్సవ రాటకు శ్రీకారం చుట్టారు. కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు, టీటీడీ ఉద్యొగులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితర భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.