నారాయణ తిరుమల ఆలయాన్ని దర్శించుకున్న జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జ్యోత్స్నా
అక్షరకిరణం, (పొందూరు): పొందూరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి బి.జ్యోత్స్నా మంగళవారం శ్రీకాకుళంలోని ప్రముఖ నారాయణ తిరుమల ఆలయాన్ని దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో ఆలయానికి వెళ్లిన జడ్జికి ఆలయ సిబ్బంది, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వేంకటేశ్వరస్వామి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందించారు. అక్కడ నుంచి అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం చేయించారు. జడ్జి జ్యోత్స్నా మాట్లాడుతూ నారాయణ తిరుమలలో స్వామిని దర్శించుకోవడం తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనుభూతి కలిగిందని ఆనందం వ్యక్తం చేశారు.