ఏపీ చీఫ్ జస్టీస్ లీసా గిల్‌తో జ్యుడీషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధుల భేటీ
అక్షర కిరణం, (విజయనగరం): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జ్యుడీషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు సోమవారం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ లీసా గిల్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసమావేశంలో అసోసియే షన్ ప్రతినిధులు న్యాయాధికారులు ఎదుర్కొంటున్న పలు రకాల సమస్యలను గౌరవ ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లారు. జ్యుడీషియల్ ఆఫీసర్ల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం న్యాయమూర్తుల పనితీరు, పరిస్థితుల గురించి తెలుసుకుని సమీక్షిస్తామని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ లీసా గిల్ తెలియ జేశారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జ్యుడీషియల్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చక్రపాణి శ్రీ రమేష్ నాయుడు కుమారి శైలజ శ్రీనివాసరావు బెజవాడ రాధారాణి వెన్నెల వెంకట శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.