జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ
ఏయూలో బాణసంచా దుకాణాలకు అనుమతి వద్దంటూ హైకోర్టులో మూర్తి పిటిషన్
మూర్తి యాదవ్ పిటిషన్‌ను రద్దు చేసిన హైకోర్టు మూర్తి యాదవ్‌పై పలు ఆరోపణలు
అక్షర కిరణం, (అమరావతి/విశాఖపట్నం): హైకోర్టులో జనసేన నాయకుడు పీతల మూర్తికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఏయూలో బాణసంచా దుకాణాలకు అనుమతులు మంజూరు చేయకూడదని హైకోర్ట్‌లో పీతల మూర్తి యాదవ్ ప్రజావాజ్యం దాఖలు చేశారు. జన నివాసాల మధ్య ఏయూ మైదానం ఉందని అందువల్ల అక్కడ బాణ సంచా దుకాణాలు ఏర్పాడు చేయకూడదంటూ హైకోర్టు ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం మూర్తి యాదవ్ చేశారు. దీనిపై ఏయూ, జీవీఎంసీ అధికారులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేశారు. జనవాసాలకు దూరంగా ఏయూ మైదా నంలో 13 ఏళ్లుగా బాణసంచా అమ్మకాలు జరుగుతున్నా యని హైకోర్టుకు జీవీఎంసీ, ఏయూ అధికారులు తెలి పారు. దీంతో మూర్తి యాదవ్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. హైకోర్టు తన పిటీషన్ డిస్మిస్ చేయడంతో పీతల మూర్తి కంగు తిన్నారు. కాగా పీతల మూర్తి యాదవ్‌పై ఇప్పటికే పలు ఆరోపణలు ఉన్నాయి.