అప్యాయతలు, అనుబంధాలకు జగన్ చెల్లుచీటి..
తల్లి, చెల్లిపై కోర్టుకు ఎక్కిన జగన్
అక్షర కిరణం, (అమరావతి): ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆయన సోదరి వైఎస్ షర్మిల మధ్య వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయనే తెలు స్తోంది. గత ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓటమికి ఓ వైపు షర్మిల కూడా కారణమనే టాక్ ఉంది. ఇక ప్రతిపక్షంలో ఉన్నా కూడా వైఎస్ జగన్‌పై విమర్శలు చేస్తూనే వస్తున్నారు షర్మిల. ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి కోర్టును ఆశ్రయించారు. చట్టవిరుద్ధమైన షేర్ బదిలీలపై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సిఎల్‌టి) పిటిషన్‌ను ఫైల్ చేశారు వైఎస్ జగన్. జగన్ హైదరాబాద్‌లోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సి ఎల్టి)కి సమర్పించిన పిటిష న్లో తన సోదరి వైఎస్ షర్మిలకు మధ్య ఎలాంటి ప్రేమాభి మానాలు లేవని. తల్లి వైఎస్ విజయమ్మ, షర్మిల ప్రమేయం ఉన్న సరస్వతీ పవర్ కంపెనీలో అక్రమ వాటాల బదిలీలను రద్దు చేయాలని జగన్, ఆయన భార్య భారతి రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొన్నారు.
పిటీషన్లో ఏమన్నారంటే..?’’వైఎస్ షర్మిల, కృతజ్ఞత లేకుండా, నా శ్రేయస్సు గురించి పట్టించుకోకుండా, నన్ను తీవ్రంగా బాధించే చర్యలు చేస్తూ వెళుతోంది. ఆమె చేసిన పనులే కాకుండా, బహిరంగంగా అసత్య, తప్పుడు ప్రకటన లతోపాటు, రాజకీయంగా నన్ను వ్యతిరేకించింది. అంతే కాకుండా వ్యక్తిగతంగా అపకీర్తిని కలిగించాయి.’’ అని తన పిటీషన్లో వివరించారు. తన సోదరి ఎంతో మానసిక క్షోభను కూడా కలిగించిందని వైఎస్ జగన్ తెలిపారు. తమ మధ్య ఉన్న ప్రేమ, ఆప్యాయతలన్నీ దెబ్బతిన్నాయని, ఆమె చేసిన ఆరోపణలన్నీ రాజకీయంగా ప్రేరేపించినవి ఇవి తన ను వేదనకు గురిచేశాయని జగన్ అన్నారు. సరస్వతీ పవర్ కంపెనీలో వాటాలకు సంబంధించి ఈపిటిషన్‌లో ప్రస్తావిం చారు. ఎంవోయూను ఉల్లంఘించి షర్మిల, విజయమ్మ తదితరులు 2024 జూలైలో నిబంధనలను పాటించకుం డా, గతంలో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని (ఎంవో యూ) ఉల్లంఘించి అక్రమంగా షేర్లను బదిలీ చేశారని జగన్, భారతి ఆరోపించారు. జూలై 6, 2024 నాటి బోర్డు తీర్మానంతో జరిగిన వాటా బదిలీలు కంపెనీల చట్టంలోని సెక్షన్ 56 ప్రకారం వాటా బదిలీ ఫారమ్‌లు లేదా ఒరిజినల్ షేర్ సర్టిఫికేట్లను సమర్పించకుండానే జరిగాయని జగన్, భారతి పిటిషన్లో పేర్కొన్నారు. ఆగస్టు 31, 2019 నాటి ఎంవోయూ ప్రకారం ఉన్న కొన్ని ఆస్తులు, వాటాలను షర్మిలకు బదిలీ చేయాలనే తన ఉద్దేశం ప్రేమ, ఆప్యాయత పై ఆధారపడి ఉందని మాజీ ముఖ్యమంత్రి హైలైట్ చేశారు. ఆస్తుల బదిలీని... ఇటీవలి సంఘటనల కారణంగా తోబుట్టు వుల మధ్య ప్రేమ లేదని, వాటాలు లేదా ఆస్తుల బదిలీని కొన సాగించకూడదని నిర్ణయించుకున్నానని జగన్ అన్నారు. జగన్ నుండి విజయమ్మకు 74,26,294 ఈక్విటీ షేర్లు, భారతి నుండి విజయమ్మకు 40,50,000 షేర్లు, మరో పిటిషనర్ నుండి 12,00,000 షేర్లను ప్రతివాదులు 3, 4కి బదిలీ చేయడాన్ని రద్దు చేయాలని జగన్, వైఎస్ భారతి ఇప్పుడు అభ్యర్థిస్తున్నారు. దీంతో జగన్, వైఎస్ షర్మిల మధ్య రాజీ కుదిరిందన్న వస్తున్న వార్తలకు చెక్ పడినట్లయింది. జగన్ కోర్టును ఆశ్రయించడంతో ఇప్పుడు అన్నా చెల్లెళ్ల ఆస్తుల వివాదం న్యాయస్థానానికి చేరినట్లయింది.