జేఎన్టీయూ ఇన్చార్జి వీసీ రాజ్యలక్ష్మికి అవుట్ స్టాండిరగ్ లీడర్షిప్ లెగసీ అవార్డు
అక్షర కిరణం, (విజయనగరం ప్రతినిధి): ఇంజినీ రింగ్ విద్యా రంగంలో చేసిన విశేష కృషికి జేఎన్టీయూ -జీవీ (ఇన్చార్జి) వైస్-ఛాన్స్లర్ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మికి ‘అవుట్ స్టాండిరగ్ లీడర్షిప్ లెగసీ అవార్డ్’ లభించింది. ఇంజినీరింగ్ విద్యా రంగంలో చేసిన అసాధారణ కృషికి గుర్తింపుగా జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూని వర్సిటీ గురజాడ విజయనగరం (ఇన్చార్జి) వైస్ - ఛాన్స్ లర్ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మికి కౌన్సిల్ ఫర్ స్కిల్స్ అండ్ కంపి టెన్సీస్ (సీిఎస్సీ ఇండియా) ‘అవుట్ స్టాండిరగ్ లీడర్షిప్ లెగసీ అవార్డ్’ను ఇంజినీర్ల దినోత్సవం సందర్భంగా జరిగిన ఉత్సవంలో వర్చువల్గా ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా సీఎస్సీ ఇండియా సీనియర్ లెర్నింగ్ కన్సల్టెంట్ వై.రామ్మోహనరావు మాట్లాడుతూ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి దార్శనికత, ఇంజినీరింగ్ విద్యా రంగంలో ఆమె చేసిన దీర్ఘకాలిక కృషిని ప్రశంసించారు. ‘విద్యా రంగంలో ఆమె చూపించిన అంకితభావం, ప్రభావం అత్యంత విశిష్ట మైనది. ఆమె నాయకత్వం భవిష్యత్తు తరాలకు ప్రేరణని చ్చేలా ఉంది,’ అని వ్యాఖ్యానించారు. ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో జేఎన్టీయూ-జీవీ యూనివర్సిటీ అనేక క్షేత్రాల్లో ముందడుగు వేసింది. ఆమె విశిష్ట నాయకత్వంతో ఈ విద్యాసంస్థ రాబోయే తరాలకు ఒక మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. అవార్డు అందుకున్న ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మిని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జి.జయసుమ, వర్సిటీ డైరెక్టర్లు, కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సి పాల్, వైస్-ప్రిన్సిపాల్, వివిధ విభాగాల అధిపతులు, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు అభినందించారు.