5వ వార్డులో జెడ్సీ మల్లయ్యనాయుడు పర్యటన
అక్షర29, 3 కిరణం, (వన్‌టౌన్): జీవీఎంసీ జోన్`4లో జోనల్ కమిషనర్ ఎం.మల్లయ్యనాయుడు 29, 35వ వార్డుల్లో మంగళవారం పర్యటించారు. పర్యటన సందర్భం గా కాలువలలో పేరుకుపోయిన పూడికలను వెంటనే తొలగించాలని, రోడ్లపై చెత్త లేకుండా ఎప్పటికప్పుడు శుభ్ర పరిచాలని సిబ్బందికి సూచించారు. అలాగే పండుగ సందర్భంగా వీధులలో పేరుకుపోయిన చెత్తను తుడిచి, అన్ని వార్డుల మెయిన్ రోడ్ల నుండి చెత్తను తొలగించి సకాలంలో తరలించాలని ఆదేశించారు. తదుపరి 35వ వార్డులోని టౌన్ కొత్త రోడ్, ఆర్ఆర్ఎంఆర్ రోడ్డులో ఉన్న కల్వర్ట్లలో పేరుకుపోయిన వ్యర్ధాలను మెషినరీ సహాయంతో తొలగించాలని సానిటేషన్ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. పర్యటనలో సానిటరీ సూపర్వైజర్ కిషోర్, సానిటరీ ఇన్స్పెక్టర్ శివప్రసాద్, రాజు, సానిటరీ సెక్రటరీలు పాల్గొన్నారు.