లడ్డు వివాదానికి మతం రంగు పూయడం సరికాదు
మహాత్మ ఫాసిస్టు బీజేపీ నుంచి దేశాన్ని కాపాడు గాంధీ జయంతిలో షర్మిల
అక్షర కిరణం, (విశాఖపట్నం): లడ్డూ వివాదానికి మతం రంగు పూయడం సరికాదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. తిరుమల లడ్డూ విషయంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య లను బట్టి కేంద్రం దర్యాప్తు చేయాలని అన్నట్టు ఉందన్నారు. తిరుమల లడ్డూ విషయంలో సీబీఐ ఎంక్వయిరీ వెయ్యాలని అందరికంటే ముందు కాంగ్రెస్ పార్టీ అడిగిందని షర్మిల గుర్తు చేశారు. నగరానికి విచ్చేసైఇన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఎయిర్పోర్టు వద్ద షర్మిల మీడియాతో మాట్లాడారు. తిరుమల లడ్డూ విషయంపై సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. ఈ వ్యవహారాన్ని కేంద్రం దర్యాప్తు చేయాలని అన్నట్టుగా ఉందన్నారు. తిరుమల లడ్డూ విషయంలో సీబీఐ ఎంక్వయిరీ వెయ్యాలని అందరికంటే ముందు కాంగ్రెస్ పార్టీ అడిగిందన్నారు. సీబీఐతో విచారణ జరిపించాలని గవర్నర్ను కూడా కలిశామన్నారు. చీఫ్ జస్టిస్ లడ్డూ విషయాన్ని సుమోటోగా స్వీకరించాలని కాంగ్రెస్ పార్టీ లేఖ రాసినట్టు తెలిపారు. సుప్రీంకోర్టు కూడా తమతోపాటు ఏకీభవిస్తున్నం దుకు హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ లడ్డూ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయొద్దని కాంగ్రెస్ పార్టీ ముందే చెప్పిందన్నారు.‘‘ ఒకరేమో శాంతి పూజలు అంటున్నారు.. మరొక రేమో పశ్చాత్తాప దీక్షలంటున్నారు.. ఇంకొకరేమో ప్రక్షాళన పూజలు అంటు న్నారు.. ఇలా ఒక్కొక్కరు మతం రంగు పూస్తున్నారు ఇది సరికాదు’’ అంటూ షర్మిల వ్యాఖ్యలు చేశారు.
మహత్మా ఫాసిస్టు బీజేపీ నుంచి దేశాన్ని కాపాడు : గాంధీజీకి షర్మిల నివాళులు..
ఎయిర్పోర్టు నుంచి జీవీ ఎంసీ గాంధీ విగ్రహం వద్దకు చేరు కున్న షర్మిల అక్కడ జాతిపిత మహాత్మ గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొ న్నారు. గాంధీ విగ్రహానికి పూల మాల లు వేసి నివాళులర్పించారు. అనంత రం గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన దీక్షలో షర్మిల పాల్గొన్నారు. ఫాసిట్టు బీజేపీ నుంచి దేశాన్ని కాపాడా లంటూ మహాత్ముని కోరారు. బాపూజీకి ఆమె నివాళులర్పించారు. కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ నేతలు మూల వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.