57వ వార్డులో ఇది మంచి ప్రభుత్వం
అక్షర కిరణం, (విశాఖపట్నం): జీవీఎంసీ 57వ వార్డులో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని పశ్చిమ ని యోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు శనివారం ప్రారంభిం చారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సంక్షోభం లోనూ సంక్షేమం అందించి అభివృద్ధికి రెక్కలు తొడిగి మొదటి వంద రోజుల్లోనే ఇది మంచి ప్రభుత్వం అని ప్రజల తో అనిపించుకుంటుంది కూటమి ప్రభుత్వం అని అన్నారు. ఈ వంద రోజుల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దుచేసి, ఐదు రూపాయలకే పేదల ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్లను పునర్ ప్రారంభించడం, పెన్షన్లు ఒకేసారి 1000 రూపా యలు పెంచి 4000 ఇవ్వడం, ప్రతి నెల ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇస్తూ, నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ మెగా డీఎస్సీ, ఉపాధ్యాయ పోస్టుల భర్తీని చేయడం వంటి హామీలను కూటమి ప్రభుత్వం వంద రోజుల్లో నేరవేర్చిందని తెలిపారు. కార్యక్రమంలో 57వ వార్డ్ అధ్యక్షులు పెంటకోట అజయ్‌బాబు, 56వ వార్డ్ కార్పొరేటర్ శరగడం రాజశేఖర్, జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రఘు, 57వ వార్డ్ బీజేపీ అధ్యక్షులు రాపేటి నారాయణరావు, జనసేన నాయకులు ప్రకాష్, మాణిప్రసాద్, గౌరీ, 54వ వార్డ్ అధ్యక్షులు కార్తీక్ కుట్టా,57 వార్డ్ సెక్రెటరీ నర్సింగరావు, బీజేపీ నాయకులు కిల్లి శ్రీరామ్మూర్తి, పిల్లి దుర్గారావు, మహిళా అధ్యక్షురాలు మామిడి లక్ష్మి, టీడీపీ నాయకులు నాగల అప్పలరాజు, సుధా సోమేశ్, సురేష్, ఉమా, తట్ట నరేష్, దాసరి శివ, టీడీపీ రాష్ట్ర, జిల్లా, వార్డ్ నాయకులు, ఏడుకొండలు (డీఈ), చిరంజీవి (ఏపీడీ) తదితరులు పాల్గొన్నారు.