రూ.10 నాణెంపై ఇండియన్ బ్యాంక్ అవగాహన కార్యక్రమాలు
అక్షర కిరణం, (హైదరాబాద్): ప్రజల్లో పది రూపా యల కాయిన్‌పై అపోహలు తొలగించేందుకు ఇండియన్ బ్యాంక్ అవగాహన కార్యక్రమాలు ప్రారంభించింది. పది రూపాయల కాయిన్ చెల్లదంటూ ప్రజల్లో ఓ ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు ఈ కాయిన్‌కు చెల్లదని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అధికారికంగా ఎప్పుడూ ప్రకటించలేదు. అంతేకాదు రూ.10 కాయిన్ తీసుకోవడాన్ని నిరాకరిస్తే దానిని ఆర్థిక నేరంగా పరిగణించాలని ఇప్పటికే ఆర్బీఐ ప్రకటన కూడా చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికి ప్రజల్లో మాత్రం ఈ కాయిన్ చెల్లదనే అపోహ మాత్రం పోవడంలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా రూ.10 నాణేలపై ఇండియన్ బ్యాంక్ అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఈ కాయిన్స్ చట్ట బద్ధమైనవని, వీటిని రోజువారీ లావాదేవీలకు ఉపయో గించవచ్చని ఇండియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. వీటి చలామణిని వ్యాపార లావాదేవీలకు ఉపయోగించాలని, ఆర్బీఐ ఉత్తర్వుల మేరకు విస్తృత అవగాహన కల్పించేందుకు ఇండియన్ బ్యాంక్ చర్యలు చేపడుతోందని తెలిపారు. తమ ఖాతాదారులకు 10 రూపాయల నాణేలు వినియోగించాలని సూచిస్తున్నామని తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో ఈనాణేలు చెల్లబాటు అవుతున్నా యని తెలిపారు. కాగా ఈ సందర్భంగా పలువురు ఖాతాదారులు ఈ నాణేలను జీఎం నుంచి అందుకున్నారు. ఇలా పది రూపాయల నాణెం వినియోగంపై ఇండియన్ బ్యాంక్ విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.