ఏఎంటీజెడ్ క్యాంపస్‌లో నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్స్టెన్షన్ ప్రారంభం
అక్షరకిరణం, (మాధవధార): రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి వ్యవస్థాపకత (స్వతంత్ర బాధ్యత), భారత ప్రభుత్వ విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి విశాఖపట్నంలోని ప్రతిష్టాత్మకమైన ఏఎంటీజెడ్ (ఆంధ్రప్రదేశ్ మెడ్‌టెక్ జోన్) క్యాంపస్‌లో నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్స్టెన్షన్ ను ప్రారంభించారు. నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ డైరెక్టర్ జనరల్/అదనపు కార్యదర్శి త్రిషల్జిత్ సేథి మాట్లాడుతూ ఎన్ఎస్టీఐ ప్రాముఖ్యతను, ఏఎంటీజెడ్లోని ఇతర పరిశ్ర మలతో కలిసి పనిచేయడంతో ట్రైనీల సాంకేతిక నైపుణ్యా లను, ముఖ్యంగా వైద్య సాంకేతిక రంగంలో పెంపొందించ డంలో ఈ భాగస్వామ్యం కీలక పాత్ర పోషిస్తుందని ఆమె తెలి యజేశారు. నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్స్టెన్షన్ లో ప్రత్యేక మెడకల్ కోర్సులను ప్రారంభించేందుకు వైద్య పరికరాల అవసరం ఉందని సేథీ తెలియచేశారు. దీనికి స్పందిస్తూ ఏఎంటీజెడ్ సీఈఓ సంస్థ శిక్షణ కార్యక్రమాలకు అవసరమైన వైద్య పరికరాలను ఉచితంగా అందచేస్తామని చెప్పారు. కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి జయంత్ చౌదరి మాట్లాడుతూ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అనేక రకాల నైపుణ్యాభివృద్ధి అవకాశాలను ఇన్స్టిట్యూట్ అందించేలా నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్స్టెన్షన్ కి మంత్రిత్వ శాఖ మరిన్ని ట్రేడ్లను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కొత్త ట్రేడ్ల వల్ల విద్యార్థులకు అధిక ప్రయోజనం చేకూరుతుందని, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏఎంటీజెడ్ సీఈఓ ఎన్ఎస్టీఐ ట్రైనీలను ఏఎంటీజెడ్‌లో అంతర్గత పరిశ్రమలు అందించే శిక్షణ అవకాశాలను ఉపయోగించుకోవాలని ప్రోత్సహించారు. కార్యక్రమంలో ఆర్డిఎస్డిఇ ఏపీ రీజనల్ డైరెక్టర్ కె. శ్రీనివాసరావు, కె.శ్రీకాంత్ బాబు, రామరాజు, సీహెచ్ అప్పలనాయుడు, బి.అప్పారావు తదితరులు పాల్గొన్నారు.