వైశాఖీ పార్కులో ఆకట్టుకున్న దసరా దాండియా
అక్షర కిరణం, (మాధవధార): వైశాఖీ స్పోర్ట్స్ పార్క్‌లో ‘దసరా దాండియా’ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ ‘దసరా వేడుకలు వైశాఖీ స్పోర్ట్స్ పార్క్ అధ్యక్షుడు సనపల వరప్రసాద్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశాఖ ఎంపీ శ్రీభరత్, జోన్-5 కమిషనర్ బొడ్డేపల్లి రాము, జనసేన డాక్టర్ సెల్ చైర్మన్ బొడ్డేపల్లి రఘు, బీజేపీ నేతలు శ్యామల దీపీక, సునీల్ అగర్వాల్, పృధ్వీరాజ్ పాల్గొన్నారు. పార్క్‌లో దసరాదాండియా ఫెస్టివల్, దాండియా, గర్బా నైట్‌తో నృత్యం కోలాహలంగా నిర్వహించారు. చిన్నారులు ఉత్సాహంగా దాండియా నృత్యం చేశారు. చిన్నారులు చేసిన నవదుర్గ అవతారాల ప్రదర్శన ఆకట్టుకుంది. దసరా శరన్నవ రాత్రి ఉత్సవాలు సందర్భంగా వైశాఖి స్పోర్ట్స్పార్క్ ఆధ్వర్యంలో నిర్వహించిన దసరా దాండియా ఫెస్టివల్ సందడి సాగింది. మన సంస్కృతి, సంప్రదాయాలు భవిష్యత్తరాలకు అందిం చాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. శక్తి స్వరూపిణి అమ్మవారిని కీర్తిస్తూ దాండియా నిర్వహించడం అభినంద నీయమని ఎంపీ శ్రీభరత్ కొనియాడారు. ఈ సందర్బంగా పార్క్‌లో రుచికరమైన వంటకాల స్టాళ్లను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు తదితరులు సుమారు 2000మంది వరకు పాల్గొన్నారు.