అక్రమంగా నిల్వ చేసిన ఎరువుల సీజ్
అక్షర కిరణం, (సాలూరు/పాచిపెంట): పాంచాలి గ్రామంలో ఓ గోడౌన్లో అక్రమంగా నిల్వ చేసిన 240 ఎరువుల బస్తాలను సీజ్ చేసినట్టు ఏవో జమ్ము శంకరరావు తెలిపారు. పాచిపెంట మండలం పాంచాలి గ్రామంలో ఎరువుల అక్రమంగా నిల్వ చేస్తున్న గొడౌన్‌పైఐ దాడి చేసినట్టు ఏవో తెలిపారు. పాంచాలి గ్రామానికి చెందిన పొట్టా సీతా రామయ్య గ్రామంలో ఒక పాడుబడిన ఇంటిలో సుమారు 240 బస్తాల ఎరువులను అక్రమంగా నిల్వ చేసినట్టు అందిన సమాచారం మేరకు దాడి చేసినట్టు తెలి పారు. మండల వ్యవసాయ అధికారి జమ్ము శంకరరావు, వీఆర్వో మత్స సందీప్ కుమార్, పాచిపెంట అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ బెల్లాన ముసలయ్య సహాయంతో ఈ గోడౌన్‌పై దాని చేసి తనిఖీ చేశామని తెలిపారు. గోడౌన్లో మొత్తం 240 బస్తాల ఎరువులను అక్రమంగా నిల్వ చేసినట్టు గుర్తించి సీజ్ చేసినట్టు పాచిపెంట మండలం వ్యవసాయ అధికారి జమ్ము శంకరరావు తెలిపారు.