నేరాల నియంత్రణకు కృషి చేస్తా
Åడీఎస్పీ ధనుంజయ నాయుడు బాధ్యతల స్వీకారం
అక్షర కిరణం, (శ్రీకాకుళం): సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం, ప్రజలు సమష్టిగా కృషి చేయడం ఎంతో ముఖ్యమని డీఎస్పీ సీహెచ్ ధనుంజయ నాయుడు అన్నారు. నగరంలోని గూనపాలెం వద్ద ఉన్న డీఎస్పీ కార్యాల యంలో సోమవారం ధనుంజయ నాయుడు నూతన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా సమస్యత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరి స్తామని తెలిపారు. సిబ్బందిని అప్రమత్తం చేసి గ్రామా ల్లోనూ, నగరంలోనూ ఎటువంటి అవాంఛనీయ సంఘ టన జరగకుండా శాంతిభద్రతల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఆధునిక టెక్నాలజీని ఉపయో గించి నేరాలను అరికట్టడం, దర్యాప్తు వేగవంతం చేయడం లో తన వంతు పాత్ర పోషిస్తానన్నారు. రద్దీ ప్రాంతాలు, నివాసిత ప్రాంతాల్లో సీసీటీవీలతో నిఘా పెంచడం అత్యవస రమన్నారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఆన్లైన్ మోసాలు, ఓటీపీ అభ్యర్థనలు, అపరిచి తుల లింకులపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచిం చారు. యువత మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని తెలిపారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. సైబర్ మోసాలపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు కల్పించి వారిని చైతన్యం చేయిస్తామని వివరించారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించి సంబంధిత సిబ్బందికి సూచనలు, సలహాలు అందజేస్తామన్నారు. సోషల్ మీడియాలో అసభ్యకర, అభ్యంతర పోస్టులను పెట్టిన వారిపై చర్యలు తీసుకోంటా మని హెచ్చరించారు.