త్వరలో ఏపీ ఎన్నికల గుట్టు విప్పుతా.. స్టడీ చేస్తున్నా.. 2 వారాల్లో వస్తా
Åప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు
అక్షర కిరణం, (హైదరాబాద్): ఓటర్ల జాబితా ప్రక్రియపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎసఐఆర్ (సర్) ప్రక్రియపై ఆయన హైదరాబాద్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా దేశంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎసఐఆర్) ప్రక్రియపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై కూడా ప్రకాశ్ రాజ్ మాట్లాడారు. ఏపీలో జరిగిన ఎన్నికలపై రీసెర్చ్ చేస్తున్నానని ఆయన చెప్పారు. దాని గురించి రెండు వారాల్లో మాట్లాడతానని అన్నారు. అలాగే ఎలక్షన్ కమిషన్ విషయంలో ఇంత పెద్ద వివాదం జరుగుతుంటే, బీజేపీ కూటమి పార్టనర్స్ ఏమి చేస్తున్నారని క్వశ్చన్ చేశారు.
ప్రకాశ్ రాజ్ మాట్లాడుతూ సర్ ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా తొలగించిన 13 కోట్ల మంది ఓటర్ల పేర్లను వెంటనే తిరిగి చేర్చి, పాత ఓటర్ల లిస్ట్‌నే కొనసాగించాలని ఆయన కోరారు. దళితులు, ముస్లింలే టార్గెట్‌గా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ కొనసాగుతోందని ప్రకాశ్‌రాజ్ ఆరోపించారు. బతికుండ గానే ఓట్లు తొలగించారని ప్రజలు చెబుతున్నారని, ఎవరి ఓట్లు ఉంచాలన్నది బీజేపీ కార్యాలయం నుంచి జాబితా వెళ్తోందని విమర్శించారు. ఆ పార్టీ అనుకూల ఓట్లను మాత్రమే ఉంచుతున్నారని తెలిపారు. దేశంలో అక్రమ చొర బాటుదారులుంటే ఇన్నేళ్లుగా కేంద్ర హోంశాఖ ఏం చేసిం దని, ఏం యాక్షన్ తీసుకుందని ప్రకాశ్‌రాజ్ సూటిగా ప్రశ్నించారు.
ఏపీ ఎన్నికలపై హాట్ కామెంట్స్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై కూడా ప్రకాశ్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జరిగిన ఎన్నికలపై రీసెర్చ్ చేస్తున్నానని ఆయన చెప్పారు. దాని గురించి రెండు వారాల్లో మాట్లాడతానన్నారు. తప్పుడు విధానాలతో ప్రభుత్వాలు మారిపోతున్నాయని, ఎలక్షన్ కమిషన్ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిందన్నారు. ఎలక్షన్ కమిషన్ విషయంలో ఇంత పెద్ద వివాదం జరుగుతుంటే, బీజేపీ కూటమి పార్టనర్స్ ఏమి చేస్తున్నారని క్వశ్చన్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పవన్‌కళ్యాణ్, నితిష్ కుమార్ వంటి వారు ఓటర్ల విషయంపై ఏమి మాట్లాడరా? అని ప్రకాశ్‌రాజ్ అడిగారు. మీకు ఓటు వేసిన ప్రజల ఓట్లే తొలగిస్తుంటే ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రకాశ్‌రాజ్ నిలదీశారు.
సర్‌పై ప్రకాశ్ రాజ్ పర్యటన...
ప్రకాశ్ రాజ్ మొదటి నుంచి సర్ ప్రక్రియపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఆయన ఓటే గల్లంతు కావడంతో ప్రకాశ్ రాజ్ నేరుగా రంగంలోకి దిగారు. 10 రోజుల పాటు సర్ ప్రతిఘటన పర్యటన’ కార్యక్రమాన్ని నిర్వహించారు. సెప్టెంబర్ 23న కర్ణాటకలోని కలబురగిలో ఈ పర్యటనను ప్రారంభించారు. పేదలు, మురికివాడల ప్రజలు, ఓటర్లను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంవత్సరాల తరబడి ఉంటున్న ప్రజల ఓట్లను అన్యాయంగా తొలగిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.