మాజీ మంత్రి జోగి రమేష్‌కు హైకోర్టు షాక్
కవైసీపీ నాయకులు బెయిల్ పిటీషన్ల తిరస్కరణ
అక్షర కిరణం, (విశాఖపట్నం): వైసీపీ నాయకులకు ఏపీ హైకోర్టులో షాక్ తగిలింది. వైసీపీ నాయకులు పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు రిజెక్ట్ చేసింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఆయనతోపాటు తలశిల రఘురాం, అప్పరెడ్డి, నందిగం సురేష్, దేవినేని అవినాష్, సహా ఇతర వైసీపీ నాయకులు పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో వైసీపీ నాయకులు షాక్ తగిలినట్టయ్యింది.