బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు
Åఉత్తరాంధ్ర జిల్లాల్లో కుండపోత Åపాఠశాలలకు సెలవు ప్రకటించిన డీఈవోలు
అక్షర కిరణం, (విశాఖపట్నం): బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలైనా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంలోని పలు ప్రాంతా ల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రధాన నగరాల్లోని రహదారులు జలమయం అవుతున్నా యి. కొన్ని కూడళ్లల్లో ట్రాఫిక్ జామ్ అవుతుంది. రానున్న 12 గంటల్లో వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మార నుందని, బుధవారం రాత్రి లేదా గురువారం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాల తీరాన విశాఖ- గోపాల్‌పుర్ మధ్య రేపు అంటే 23వ తేదీన రాత్రి లేదా 24వ తేదీ తెల్లవారుజామున తీవ్ర వాయుగుండం తీరం దాటుతుందని అంచనా. ఈ ప్రభావంతో 23, 24 తేదీల్లో అక్కడ క్కడ కుంభవృష్టితో అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది. బలమైన ఈదురు గాలులు వీస్తాయి. వాతావరణ శాఖ శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ప్రకటించింది. ఇందులో భాగంగా నదీ పరీవాహక, ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఈ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు
భారీ వర్షాల కారణంగా ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కుండపోత వర్షాల కారణంగా విజయనగరం జిల్లాలోని అన్ని పాఠశాలలకు సెప్టెంబర్ 23, 2026 సెలవు ప్రకటిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి (ణజుO) అధికారిక ప్రకటన విడుదల చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని స్కూళ్లకు సైతం కలెక్టర్ల ఆదేశాల మేరకు ణజుOలు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
వాయుగుండం బలపడి తీవ్ర వాయుగుండంగా మారే క్రమంలో మరింతగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాల కలెక్టర్లు పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీ క్షిస్తున్నారు. వర్షాలు ఇంకా తీవ్రమైతే ఈ జిల్లాల్లో కూడా పాఠశాలలకు సెలవులు ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలపైనే కాకుండా.. కోస్తాంధ్ర, యానాం ప్రాంతంపైనా తీవ్ర వాయుగుండం ప్రభావం చూపనుంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో.. మంగళ, బుధవారాల్లో కోస్తా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండ గా.. ఒకట్రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని.. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.