ఏపీలో నాలుగు లైన్ల రైలు మార్గం.. 962 కిలోమీటర్లు విస్తరణకు గ్రీన్‌సిగ్నల్
¿గోదావరిపై కొత్తగా వంతెన నిర్మాణం
అక్షర కిరణం, (ఢిల్లీ/అమరావతి): ఏపీలో రైల్వే లైన్ల విస్తరణకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. రాష్ట్రం మీదుగా వెళుతున్నహౌరా టు చెన్నై రైల్వే లైన్‌ను విస్తరించాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ రూట్లోని ఇచ్చాపురం నుంచి తడ వరకు నాలుగు లైన్ల రైలు మార్గంగా విస్తరించనున్నారు. మొత్తం 962.50 కిలోమీటర్లు పొడవున రైల్వే లైన్‌ను విస్తరించనున్నారు. ఇప్పటికే ఆయా రూట్లలో మూడు లైన్ల వరకు విస్తరించగా.. మిగిలిన నాలుగో లైన్ నిర్మించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లే రైల్వే లైన్‌పై ఒత్తిడి పెరిగింది.. ప్రయాణి కుల రద్దీ పెరగడంతో పాటుగా రైళ్ల సంఖ్య కూడా పెంచాల్సి వస్తోం ది. దీనికి తోడు సరుకు రవాణా రైళ్ల కూడా ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నా యి. అందుకే కేంద్రం దేశవ్యాప్తంగా ప్రధాన రైలుమార్గాలను నాలుగు లైన్లుగా విస్తరిం చేందుకు సిద్ధమైంది. తాజాగా హౌరా టు చెన్నై మార్గాన్ని విస్తరించాలి నిర్ణయించింది.. ఈ రైల్వే లైన్లో ఏపీలోని శ్రీకాకుం జిల్లా ఇచ్ఛాపురం నుంచి తిరుపతి జల్లా తడ వరకు మొత్తం 962.50 కిలోమీటర్లు పొడ వున నాలుగై లైన్లుగా విస్తరించనున్నారు. నాలుగో రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే ఈ మార్గంలో ప్రయాణికుల రైళ్లు మరిన్ని నడిపేందుకు అవకాశం ఉంటుందన్నారు. సరకు రవాణా రైళ్లను మధ్యలో అనేక చోట్ల నిలపాల్సిన పని లేకుండా నిరంతరా యంగా పరుగులు పెట్టించొచ్చు.
మొత్తం 962.50 కిలోమీటర్లలో విశాఖ పట్నం కేంద్రంగా ఉన్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో 897.68 కిలోమీటర్లు ఉంది. చెన్నై సదరన్ రైల్వే జోన్ పరిధిలో 64.83 కిలో మీటర్ల మార్గం ఉంది. గతంలో రెండు లైన్లు గా ఉండగా.. 16.76 కిలోమీటర్లను నాలు గు లైన్లుగా విస్తరించారు. 337.36 కిలో మీటర్ల పొడవున మూడో లైన్ నిర్మించారు. మిగిలిన 608.38 కి.మీ.లో మూడు, నాలుగులైన్లు నిర్మించాల్సి ఉంది. ఈ మార్గం లో ఇచ్ఛాపురం నుంచి విజయనగరం మధ్య 191.98 కిలో మీటర్లు మూడో లైన్ పనులు సాగుతున్నాయి. తాజా గా నాలుగో లైన్‌కు అనుమతి రావడంతో.. త్వరలోనే డీపీఆర్ తయారు చేయనున్నారు. విజయ నగరం నుంచి కొత్తవలస వరకు 34.60 కిలోమీటర్ల పొడవున మొత్తాన్నీ మూడు లైన్లుగా విస్తరించగా.. నాలుగో లైన్ పనులు జరుగుతున్నాయి. కొత్తవలస నుంచి సింహా చలం వరకు 16.76 కిలోమీటర్లు పొడవున నాలుగు లైన్లు నిర్మించిన సంగతి తెలిసిందే.
సింహాచలం టు విశాఖపట్నం టు దువ్వాడ మధ్య 26.43 కిలో మీటర్లు రెండు లైన్లుగా ఉండగా.. మూడు, నాలుగు లైన్ల పనులు జరుగుతున్నాయి. దువ్వాడ టు నిడదవోలు మధ్య 205.68 కిలోమీటర్లు మూడు, నాలు గు లైన్ల పనులకు లైన్ క్లియర్ అయ్యింది. నిడదవోలు టు విజయవాడ మధ్య 127.02 కిలోమీటర్లు ఉండగా.. మూడు, నాలుగు లైన్ల నిర్మాణానికి డీపీఆర్ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. విజయవాడ ` నెల్లూరు ` గూడూ రు మధ్య 292.72 కి.మీ మూడో లైన్ నిర్మా ణం పూర్తికాగా.. నాలుగో లైన్‌కు డీపీఆర్ తయారుచేయాల్సి ఉంది. గూడూరు`తడ మధ్య 67.31 కిలోమీటర్లు మూడు, నాలుగు లైన్లకు అను మతి వచ్చింది. ఈ రూట్లో గోదావరిపై ధవళేశ్వరం బ్యారేజీకి, రోడ్-రైల్ వంతెనకు మధ్యలో 4.3 కిలోమీటర్ల మేర కొత్తగా బ్రిడ్జి నిర్మిస్తారు. అవసరమైన చోట్లు బైపాస్ నిర్మిస్తారు.