డిప్యూటీ సీఎంకు పవన్ కళ్యాణ్‌కు కూటమి శ్రేణుల ఘన స్వాగతం
అక్షర కిరణం, (పెందుర్తి): ప్రపంచ ఏనుగుల దినోత్సవ జాతీయ వేడుకల్లో పాల్గొనేందుకు గురువారం విశాఖ విచ్చేసిన జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్‌ని విశాఖ విమానాశ్రయంలో మర్యాద పూర్వకంగా కలిసి కూటమి ఎమ్మెల్యేలు ఘనంగా స్వాగతం పలికారు. జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు, దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తదితర కూటమి ఎమ్మెల్యేలు జనసేన పార్టీ నాయకులు, అధికారులు స్వాగతం పలికారు.