ఘనంగా శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ద్విశతాబ్ది ఉత్సవాలు
î28 నుంచి 30వ తేదీ వరకు స్వామివారికి వైభవంగా మహా కుంభాభిషేకం
అక్షర కిరణం, (సింహాచలం): సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి అనుబంధ దేవాలయమైన మాధవధారలోని శ్రీ మల్లికార్జున స్వామి వారి ఆలయాన్ని నిర్మించి 200 సంవత్సరాలు పూర్తయిన (ద్విశతాబ్ది) సందర్భంగా ఈ నెల 28 నుంచి 30వ తేదీ వరకు మూడు రోజుల పాటు ‘మహా కుంభాభిషేకం’ ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నామని అధికారులు తెలిపారు. ఈ ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల సమన్వయంతో పటిష ్టమైన ఏర్పాట్లు చేయాలని సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి జల్లేపల్లి వెంకటరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మూడు రోజుల పాటు జరిగే మహా కుంభాభిషేక మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ మల్లికార్జున స్వామి వారి కృపకు పాత్రులు కావాలని దేవస్థానం అధికారులు కోరారు.