60వ వార్డులో అనధికార నిర్మాణం కూల్చివేత
అక్షర కిరణం, (మాధవధార): జీవీఎంసీ 60వ వార్డు మురళి నగర్ పాస్‌పోర్ట్ కార్యాలయం వెనుక అక్రమంగా నిర్మిస్తున్న అదనపు అంతస్తును బుధవారం టీపీ బీవో అనిల్, టౌన్ ప్లానింగ్ సెక్రటరీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జీవీఎంసీ సిబ్బంది తొలగించారు. నిబంధనలకు విరుద్ధం గా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలుంటాయని హెచ్చరిం చారు. సచివాలయం టౌన్‌ప్లాన్ సిబ్బంది నిరంతరం తనిఖీ లు చేయాలని టౌన్‌ప్లానింగ్ అధికారులు ఆదేశించారు.