ఏపీ మద్యం షాపుల్లో కొత్త రూల్..
îకొత్త స్కానింగ్ మెషిన్లు రాబోతున్నాయి
అక్షర కిరణం, (అమరావతి): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మద్యం అమ్మకాలకు సంబంధించి కొత్త రూల్ తీసుకొచ్చేం దుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మద్యం అమ్మకాల్లో పారదర్శకత కోసం చర్యలు తీసుకుంటోంది. మద్యం షాపు ల్లో బాటిళ్లను స్కాన్ చేసిన తర్వాతే విక్రయించేలా కొత్త విధానాన్ని తీసుకురానుంది. ఈ బాటిల్‌పై ఉండే బార్కోడ్ ను స్కాన్ చేయగానే ధరతో పాటుగా అన్ని వివరాలు కనిపిస్తాయి. ఆ బాటిల్ ధర ఎంతో స్కానింగ్ మెషిన్ ద్వారా స్పీకర్లో వినిపించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఒక్కమాటలో చెప్పాలంటే.. సూపర్ మార్కెట్లలో వస్తువు లపై ఉండే బార్ కోడ్ స్కాన్ చేసి బిల్లు వేసినట్లుగా.. మద్యం షాపుల్లో కూడా స్కాన్ చేసిన తర్వాత లిక్కర్ బాటిళ్లు విక్రయిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేసేంందుకు స్కానింగ్ మెషిన్లను కూడా సిద్ధం చేసి సరఫరా చేసే ప్రక్రియ మొదలైందని తెలుస్తోంది.. నెల వారీ అద్దెను చెల్లించాల్సి ఉంటుంది.
రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపుల్లో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బాటిళ్ల విక్రయా లు కొనసాగుతాయి. కేవలం ఆ సమయంలో మాత్రమే ఈ స్కానింగ్ మెషిన్లు పనిచేసేలా సాఫ్ట్వేర్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అంటే ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఈ మెషిన్లు పనిచేస్తాయి. ఈ విధానాన్ని తీసుకొస్తే మద్యం విక్రయాల్లో పారదర్శకత ఉంటుందని.. మద్యాన్ని ఎక్కువ ధరలకు అమ్మే అవకాశం ఉండదంటున్నారు. మద్యం బాటిళ్లు స్కానింగ్ చేయగానే స్క్రీన్, స్పీకర్‌తో ధరలు తెలుస్తాయంటున్నారు. ఒకవేళ మద్యం బాటిళ్లను స్కాన్ చేయకుండా అమ్మితే వివరణ ఇవ్వాల్సి ఉంటుంది.. అలాగే ఎక్సైజ్ శాఖ జరిమానాలు విధిస్తుంది. ఈస్కానింగ్ విధానంతో మద్యం అమ్మకాల రియల్ టైమ్ డేటా కూడా ప్రభుత్వానికి అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు.
ప్రస్తుతం అమలవుతున్న విధానంలో.. డిస్టలరీల్లో మద్యం బాటిళ్ల ఉత్పత్తి, అక్కడ మద్యం డిపోలకు తరలించే వరకు ట్రాక్ చేస్తున్నారు. డిపో నుంచి షాపులకు వెళ్లిన తర్వాత వివరాలు ప్రభుత్వం దగ్గర లేకుండా పోయాయి. కొంత మంది మద్యం వ్యాపారులు ధరలు పెంచేసి విక్రయిస్తు న్నారనే ఫిర్యాదులు కూడా వచ్చాయి. తాజాగా తీసుకొస్తున్న స్కానింగ్ విధానంలో ఎంత మద్యాన్ని విక్రయించారో వివరాలు తెలుస్తాయంటున్నారు. ఒక్కో వ్యాపారి ఎంత మేర మద్యం స్టాకు అమ్మాడు.. ఇంకా ఎంత స్టాక్ ఉందో కూడా తెలుస్తుందని చెబుతున్నారు. ఒకవేళ స్టాకులో ఏదైనా తేడా ఉంటే వెంటనే అధికారులకు తెలుస్తుంది.. వెంటనే ఎక్సైజ్ అధికారులు చర్యలు తీసుకుంటారు.
ఈ మెషిన్లను ఆప్స్టెక్ సంస్థ సరఫరా చేస్తున్నట్లు తెలు స్తోంది. ఈమెషిన్లకు ప్రతి నెలా అద్దె చెల్లించాల్సి ఉంటుంది.. షాపులు నిర్వహించే వ్యాపారులు ఈ అద్దెను కట్టాల్సి ఉంటుందని తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కూడా ఈ స్కానింగ్ మెషిన్ల విధానాన్ని తీసుకొచ్చినా పెద్దగా అమలు కాలేదని విమర్శలు ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ విధానం ఏ మేరకు అమల వుతుందన్నది చూడాలి. స్కానింగ్ మెషిన్‌కు అద్దె చెల్లించే విధానంపై వ్యాపారుల నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.