11 నుంచి 19వ తేదీ వరకు సింహాచలంలో
ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
Å20వ తేదీన విజయదశమి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు
అక్షర కిరణం, (సింహాచలం): సింహాచలంలోని శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం, ఈనెల 11వ తేదీ ఆదివారం నుంచి 19వ తేదీ సోమవారం వరకు శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి శరన్నవరాత్రి ఉత్సవాల ను వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం కార్యనిర్వహ ణాధికారి జల్లేపల్లి వెంకట్రావు తెలిపారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు, కుంకుమార్చనలు నిర్వహించనున్నారు. భక్తులకు అమ్మ వారి దర్శనం, పూజల్లో పాల్గొనే అవకాశం కల్పించను న్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని దేవస్థానం అధికారులు కోరారు. ఈనెల 20న మంగళవారం విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించ నున్నారు. శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని దర్శించుకునే భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు ఈవో తెలిపారు.
అమ్మవారి కుంకుమార్చనలో పాల్గొనదలచిన భక్తులు ఒక్కొక్కరు రూ.1,000 చొప్పున రుసుము చెల్లించాల్సి ఉంటుంది. భక్తులు ముందస్తుగా తమ పేర్లు నమోదు చేసుకుని ఈ సేవలో పాల్గొనవచ్చు. భక్తుల సౌకర్యార్థం వీaఅa వీఱtతీa డిజిటల్ గవర్నెన్స్ సేవలు, దేవస్థానం అధికారిక వెబ్‌సైట్‌తో కూడా సేవకు సంబంధించిన వివరాలు తెలుసుకుని నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. భక్తులు ష్ట్రttజూs://tఎs.aజూ.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులు ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని దేవస్థానం కోరుతోంది.