పారిశుధ్యానికి ప్రభుత్వం ప్రాధాన్యం
కఇది మంచి ప్రభుత్వంలో ఎమ్మెల్యే శిరీష
అక్షర కిరణం (పలాస): పారిశుద్ధ్యం మెరుగుపర్చేం దుకు కృషి చేస్తున్నామని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష తెలిపారు. పలాస, కాశీబుగ్గ మున్సిపాల్టీ 11వ వార్డు టీడీపీ ఇన్చార్జి చంద్రశేఖర్ త్యాడి ఆధ్వర్యంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే గౌతు శిరీష ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. గత పాలకులు సున్నం కొట్టేసి బ్లీచింగ్ వేసినట్టుగా కలరింగ్ ఇస్తూ కాలం గడిపారే తప్ప ఎక్కడి చెత్త అక్కడే విడిచిపెట్టేశారని ఎద్దేవా చేశారు. మున్సిపాల్టీకి కూటమి ప్రభుత్వం రూ.42 లక్షల పైచిలుకు నిధులను కేటాయించినట్లు చెప్పారు. చంద్రశేఖర్ త్యాడి పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే శిరీష మాట్లాడుతూ రాజకీయాలకతీతంగా అర్హులందరికీ పింఛన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. రైల్వే వంతెన నిర్వాసితుల విషయమై అధికారులతో సమీక్షించి సత్వర న్యాయం జరిగేందుకు కృషి చేస్తానని చెప్పారు. రానున్న వేసవిలో తాగునీటి కష్టాలను తీర్చాలని, అందుకు ఇప్పట్నుం చే ఆ కార్యాచరణ చేయాలని అధికారులను కోరారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు వజ్జ బాబూరావు, లొడగల కామేశ్వరరావు, గాలి కృష్ణారావు, కోట్ని దుర్గా పసాద్, దువ్వాడ శ్రీకాంత్, బడ్డ నాగరాజు, సప్ప నవీన్ కుమార్, కొరికాన శంకర్, తదితరులు పాల్గొన్నారు.