శబరిమల అయ్యప్ప భక్తులకు శుభవార్త: నవంబర్ 1 నుంచి టికెట్ల బుకింగ్
అక్షర కిరణం, (శబరిమల/జాతీయం): దేశవ్యాప్తం గా ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న శబరిమల అయ్యప్ప దర్శనాలపై ఆలయ వ్యవహారాలు చూసుకునే ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది. నవంబర్ 1వ తేదీ నుంచి ఆన్లైన్ వర్చువల్ క్యూ టికెట్ల బుకింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిపింది. ప్రతీ రోజు ఆన్లైన్ కోటా 70 వేల టికెట్లు.. ఇక శబరిమలలో 20 వేల స్పాట్ బుకింగ్ టికెట్ల కోసం 20 వేల టికెట్లు కేటాయించారు. ఈ ఏడాది కూడా భారీ సంఖ్యలో భక్తులు రానున్నారని భావిస్తున్న టీబీడీ.. వారి కి సులభంగా అయ్యప్ప దర్శనాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. శబరిమలలో మండల పూజ సీజన్ నవంబర్ 16వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. డిసెంబర్ 27వ తేదీ న మండల పూజ సీజన్ ముగియనుంది. దీనికోసం ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మండల సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు తాజాగా సమీక్ష సమావేశం నిర్వహించింది.
పంబ వద్ద భారీ పందిరిని నిర్మించేందుకు చర్యలు చేపట్ట నున్నారు. ఒకేసారి 10 వేల మంది భక్తులు సేద తీరేలా ఆ పందిరిని నిర్మించనున్నారు. శబరిమలకు వచ్చే అయ్యప్ప భక్తులను దృష్టిలో ఉంచుకుని.. సుమారు 50 లక్షల అరవణ ప్రసాదం డబ్బాలను కూడా సిద్ధం చేస్తున్నారు.
2 నెలల మండల, మకరవిళక్కు పూజల కోసం నవంబర్ 15వ తేదీ సాయంత్రం 5 గంటలకు శబరిమల ఆలయాన్ని తెరవనున్నారు. డిసెంబర్ 27న ఆలయాన్ని మూసివేయను న్నారు. ఆ తర్వాత మళ్లీ డిసెంబర్ 30న మకర పూజల కోసం ఆలయాన్ని తెరవనున్నారు. డిసెంబర్ 30 నుంచి జన వరి 14వరకు మకర మహోత్సవం ఉంటుంది. ఆ తర్వాత జనవరి 20న మకర విళక్కు పూజలను ముగిస్తారు.