వైభవంగా శ్రావణ శుక్రవారం వరలక్ష్మి దేవి పూజలు
అక్షర కిరణం, (సాలూరు): శ్రావణ మాసం మూడో శుక్రవారం శుభ సందర్భంగా సాలూరు పట్టణంలో శ్రీకామాక్షి అమ్మవారి, శ్రీకన్యకా పరమేశ్వరి, అమ్మవారు. కొత్తూరు, శ్రీమాతా అష్టలక్ష్మి. అమ్మవారి ప్రధాన ఆలయంలో శ్రావణ శుక్రవారం వరలక్ష్మిదేవి. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి వేద పండితులు వారిచే వరలక్ష్మి వ్రతాలు విశేషపూజలు శుక్రవారం నిర్వహించారు. శ్రీ కామాక్షి, అమ్మ వారి, శ్రీకన్యకా పరమేశ్వరి, అమ్మవారు శ్రీమాతా అష్టలక్ష్మి. అమ్మవారి దర్శనం కోసం వేకువ జామున నుండి ఆలయం లో భక్తులు పోటెత్తారు. అమ్మవారి ప్రత్యేక అలంకరణ చేసి ఆలయం ప్రాంగణం అంతా శ్రావణ శుక్రవారం కావడంతో అమ్మవారికి భక్తులు పోటెత్తడంతో కామాక్షి అమ్మవారి ఆలయాలు జనసంద్రంగా మారింది. కామాక్షి అమ్మవారి ఆలయంలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని అభిషే కాలు పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదంలు స్వీకరించారు. ఈకార్యక్రమంలో సాలూరు పట్టణ ఆలయాల్లో శ్రావణమాస శోభ సంతరించుకుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.