శాకాంబరీ అవతారంలో శంబర పోలమాంబ అమ్మవారు
అక్షర కిరణం, (సాలూరు): ఉత్తరాంధ్ర ఇలవేల్పు గిరిజనల ఆరాధ్యదైవం గొప్ప కల్పవల్లి శ్రీ శంబర పోలమ్మ అమ్మవారికి,శ్రీశంభర పోలమాంబ ఆలయం ఉత్సవ కమిటీ అధ్యక్షులు మైదాన తిరుపతిరావు. గ్రామస్తులు మంగళ వారం శ్రీశంబర పోలమాంబ అమ్మవారికి విజిటబుల్స్, ఫ్రూట్స్‌తో అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు తెల్లవారుజాము నుండి ఆలయానికి చేరుకుని శ్రీ శంభర పోలమాంబ అమ్మవారిని దర్శించుకుని, వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ఇష్టమైన రోజు మంగళవారం కావడంతో శ్రీశంబర పోలమాంబ అమ్మవారిని, దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించినట్లయితే సకల విజయాలు పొందుతారని భక్తులు ప్రగాఢ నమ్మకం. ఇక్కడ అమ్మవారికి వెజిటబుల్స్, ఫ్రూట్‌తో ప్రత్యేకంగా అలంకరణ చేయడం విశేషం. ఈ కార్యక్రమంలో శంబర పోలమాంబ పోలమాంబ ఈవో శ్రీనివాసరావు, ఎంపీటీసీ. అప్పలయుడు. వైస్ ప్రెసిడెంట్ అల్లు వెంకటరమణ, గింజి కాసినాయుడు, కాంటాక్ట్ కృష్ణ, మజ్జి రాము, శంభర గ్రామం డీడీపీ యువత నాయకులు నైదాన సూర్యయాదవ్, గ్రామపెద్దలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.